- విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి 75 వేల నష్టం.
- ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకోలు.
మరిపెడ,జూన్ 23(నమస్తే న్యూస్).మరిపెడ మండలం వెంకట్యా తండా శివారులో మంగళవారం విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందింది.వెంకట్యా తండాకు చెందిన రైతు బానోత్ హచ్చు తెలిపిన వివరాల ప్రకారం..తన దుక్కిటెద్దు ఉదయం మేత కోసం తండా శివారుకు వెళ్లింది.ఇటీవల వీచిన ఈదురుగాలులకు ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.గడ్డి మేస్తున్న క్రమంలో తెగిపడి ఉన్న తీగలకు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్‌తో దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతిచెందింది.వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తాను సుమారు రూ.75 వేల విలువైన దుక్కిటెద్దును కోల్పోయానని,దీంతో జీవనోపాధి కోల్పోయానని బాధిత రైతు హచ్చు కన్నీటి పర్యంతమయ్యారు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న పశువైద్యాధికారి డాక్టర్ మనోహర్ కృష్ణ కుమార్ పంచనామా నిర్వహించారు.

