Type Here to Get Search Results !

పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన సదస్సు.

 పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన సదస్సు. 




డోర్నకల్/మరిపెడ(జూన్ 22)నమస్తే న్యూస్.

మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామపంచాయతీ రైతు వేదికలో ఈరోజు వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని నిబంధనలు,గ్రామ పాలన అంశాలపై సభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఎంపీఓ సోమ్లా నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనర్లు రామోజీ,దేవయ్య శిక్షణ ఇచ్చారు.పంచాయతీ కార్యదర్శులు అరుణ్ జ్యోతి,వినోద్,ఉమేష్,రాజేంద్రప్రసాద్,కంప్యూటర్ ఆపరేటర్లు ఉమా,ఉమేష్,మునీర్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.శిక్షణలో 1.చట్టం,పాలన: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ముఖ్యాంశాలు,గ్రామ పంచాయతీ,సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల విధులు,బాధ్యతలు,పంచాయతీ కార్యదర్శి విధులు,నియమ నిబంధనలు,నియంత్రణ అదిధికారాలపై వివరించారు.2.సమావేశాలు,అభివృద్ధి:\గ్రామసభ,గ్రామ పంచాయతీ సమావేశాల నిర్వహణ,స్థాయీ సంఘాలు,ఆదర్శ గ్రామం కోసం అభివృద్ధి ప్రణాళిక,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పంచాయతీల పాత్ర గురించి తెలిపారు.3.ఆర్థిక,రికార్డులు:గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవహారాలు,ఖర్చులు,రికార్డుల నిర్వహణ,ఆడిట్,సర్‌చార్జీలు,సామాజిక తనిఖీ,ఈ-పంచాయతీ అప్లికేషన్ల వినియోగంపై అవగాహన కల్పించారు.4.పథకాలు,సేవలు:పారిశుధ్యం,వనమహోత్సవం,వీధి దీపాల నిర్వహణ,జనన మరణాల నమోదు,తాగునీటి సరఫరా,మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం,లేఅవుట్,బిల్డింగ్ అనుమతుల నియమాలు,పంచాయతీ పనుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.5.సమన్వయం:పంచాయతీలు స్వయం సహాయక సంఘాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వార్డు సభ్యులు చట్టాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి,గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.నిధులను పారదర్శకంగా వినియోగించి జవాబుదారీ పాలన అందించాలని సూచించారు.శిక్షణ అనంతరం వార్డు సభ్యుల సందేహాలను ట్రైనర్లు నివృత్తి చేశారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.