- మున్సిపల్ చైర్మన్,వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతు సధస్సు.
- రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఆధునిక ఎరువులపై అవగాహన సదస్సు.
డోర్నకల్/మరిపెడ,జూన్ 23(నమస్తే న్యూస్)
మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామ రైతు వేదిక వద్ద మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటు ధరల్లో అందించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు.రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోవద్దని,ప్రభుత్వం సరఫరా చేసే ధ్రువీకరణ పొందిన విత్తనాలనే వాడాలని సూచించారు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.విత్తన పంపిణీతో పాటు మున్సిపల్ చైర్మన్,వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.ఏ డి ఏ శ్రీదేవి,ఏ ఓ వీరాసింగ్ రైతులతో మాట్లాడుతూ నేల స్వభావానికి అనుగుణమైన పంటల ఎంపిక,విత్తన శుద్ధి,నీటి యాజమాన్యం,సమగ్ర సస్యరక్షణ చర్యలపై వివరించారు.ఆధునిక ఎరువుల వాడకం,నానో యూరియా,నానో డీఏపీ ప్రాధాన్యత,జీవన ఎరువుల వినియోగం వల్ల కలిగే లాభాలను తెలిపారు.పురుగుమందులను అవసరాన్ని బట్టి మాత్రమే,సిఫారసు చేసిన మోతాదులో వాడాలని సూచించారు.డ్రిప్,స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,గిరిపురం సర్పంచ్ నీలా సైదులు పాల్గొన్నారు.ఫర్టిలైజర్ డీలర్స్ అధ్యక్షులు కాలం శ్రీనివాస రెడ్డి,సురేందర్,ఉప్పల కృష్ణమూర్తి,హరీష్,రమేష్ తదితరులు హాజరయ్యారు.వ్యవసాయ శాఖ సిబ్బంది,స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ మేళాలో వరి రకాలు ఆర్ ఎన్ ఆర్-15048,బిపిటీ-5204,పత్తి రకాలు,కంది ఎల్ ఆర్ జి-52,పెసర డబ్ల్యూ జి జి-42,మినుము పి యు-31 వంటి అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాలను 50% సబ్సిడీపై అందుబాటులో ఉంచారు.రైతులు ఆధార్,పట్టాదారు పాస్ పుస్తకం చూపించి విత్తనాలు కొనుగోలు చేశారు.విత్తనాల నాణ్యతపై అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు పెద్ద ఎత్తున హాజరై విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు సాగు మెళకువలు తెలుసుకున్నారు.రైతుల సందేహాలను అధికారులు అక్కడికక్కడే నివృత్తి చేశారు.ఇలాంటి రైతు మేళా కార్యక్రమాలు ఇంకా మరిన్ని పెట్టి,రైతుకు ఆధునిక పంటల సాగుబడిపై కావలసిన అవగాహన కలిపిస్తూ,రైతు కష్టానికి తగ్గట్టు ఫలితాలు వచ్చేలా చేయాలని రైతులు కోరారు.

