Type Here to Get Search Results !

ఛలో వరంగల్‌కు తరలిన బీజేపీ శ్రేణులు.

ఛలో వరంగల్‌కు తరలిన బీజేపీ శ్రేణులు.



తొర్రూరు,జూన్ 29(నమస్తే న్యూస్)

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నభీన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంకు తొర్రూరు అర్బన్, రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా తొర్రూరులోని గెస్ట్ హౌస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నభీన్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు.బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరచి రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయడానికి జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి నితీన్ నభీన్ పర్యటన ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వరంగల్ ప్రాంత అభివృద్ధికి మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు విమానాశ్రయం,అమృత్ సిటీ,స్మార్ట్ సిటీ పథకాల కింద నిధులు,సమ్మక్క–సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని తెలిపారు.ఈ కారణంగా ప్రజల్లో బీజేపీపై విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలుపుల శంకర్,జిల్లా నాయకులు అమ్మాపురం గ్రామ ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, మండల ప్రధాన కార్యదర్శులు నడిగడ్డ సందీప్, గుగులోత్ భాస్కర్ నాయక్, జిల్లా,మండల నాయకులు మంగళపల్లి యాకయ్య,చలువాది సత్యనారాయణ,కాగు నవీన్,సిహెచ్.విజయ్ కుమార్,గుండా సురేష్,నూకల నవీన్,బండి శ్రీనివాస్,తాడిశెట్టి నవీన్,శోభా రాణి, సతీష్, కిన్నెర శ్రీనివాస్,శ్రీనివాస చారి,సర్వి వెంకటేష్, ధరావత్ తేజస్,సంతోష్,కొండపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.