- హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన పీఏసీఎస్ సభ్యులు
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: కాకిరాల హరిప్రసాద్ రావు
![]() |
| హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన పీఏసీఎస్ సభ్యులు |
తొర్రూరు,జూన్ 30(నమస్తే న్యూస్):
పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడు కాకిరాల హరిప్రసాద్ రావు అన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోమారం గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని, భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సెక్రటరీ ఖైత శ్రీను, సంఘం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.

