- మరిపెడలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి.
- కాంగ్రెస్ నేత శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేత.
డోర్నకల్/మరిపెడ(జూన్ 5)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని పలువురు నిరుపేద లబ్ధిదారులకు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ,అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంధసిరి భిక్షపతి,చెన్నూరు మహేష్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారులు ప్రభుత్వానికి,సహాయం అందించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

