ప్రభుత్వ ఆఫీసుల్లో ఘనంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
జెండా ఎగురవేసిన చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,జూన్ 2(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రాష్ట అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ అధికారులు,ప్రజాప్రతినిధులు మౌనం పాటించి నివాళి అర్పించారు.‘బంగారు తెలంగాణ’ కోసం పునరంకితమవుతామని అంతా ప్రతిన బూనారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉప చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ నరేష్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్,నీలా లచ్చిరామ్,కాంతమ్మ కరణ్ సింగ్,తిరుపతి,పానుగోతు రాములు,గంట్ల గౌతమ్ రెడ్డి,గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి,బోడ భాస్కర్,బేబీ రవి పాల్గొన్నారు.కాంగ్రెస్ నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి,చెన్నూరు మహేష్,తాడురి రమేష్,దూగుంట్ల వెంకన్న,యాదగిరి,మెప్మాలు,ఆర్పీ సభ్యులు,అంగన్‌వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు.మున్సిపల్ కార్యాలయం ఒక్కటే కాదు,తహసీల్దార్ కార్యాలయం,మండల పరిషత్ కార్యాలయం,పోలీస్ స్టేషన్,ప్రభుత్వ ధవాఖానలో కార్యాలయం,కార్యాలయం..ఇలా పట్టణంలోని అన్ని శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు,సిబ్బంది ఉత్సాహంగా జెండా ఎగురవేశారు.ఆఫీస్ ఆఫీస్‌కు పోటీపడి మరీ వేడుకలు చేయడంతో మరిపెడ అంతా పండుగ వాతావరణం కనిపించింది.
కార్యాలయాలకు వచ్చిన ప్రజలు కూడా వేడుకల్లో పాలుపంచుకుని ఒకరికొకరు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.



