- సంవత్సరాల నిరీక్షణకు తెర!మరిపెడలో జరుగుతోంది ఏంటి?
- సి ఐ పవన్,ఎస్ ఐ సతీష్ ‘మిషన్ మోడ్’.
- మారిపోతున్న పోలీస్ స్టేషన్ రూపురేఖలు.
డోర్నకల్/మరిపెడ,జూన్ 2(నమస్తే న్యూస్)
మరిపెడ అంటే ఇన్నాళ్లూ ధూళి,పెండింగ్ పనులే గుర్తుకొచ్చేవి.కానీ ఇప్పుడు సీన్ రివర్స్.ఎన్నో ఏళ్లుగా ఇరుకు గధుల్లో పాత భవనంలో ఇప్పుడు కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయ్ ఆధునిక హంగులతో పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా కళకళలాడుతోంది.తెరవెనుక కథ ఏంటో తెలుసా? ఇద్దరు ఆఫీసర్ల శ్రమ, పట్టుదల‘ఇది చేసి తీరాల్సిందే’ అనే అంకిత భావం.అన్ని కలగాలిసి ఈరోజు కళ కలలాడుతున్నదే మన మరిపెడ మండల పోలీసు స్టేషన్.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ దిశానిర్దేశం,తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ మార్గదర్శనంలో మరిపెడ బంగ్లా సీఐ పవన్ కుమార్,ఎస్సై సతీష్ ‘మిషన్ మోడ్’లోకి దిగారు.ఫలితంగా సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనులకు ఒక్కసారిగా ఊపిరి వచ్చింది.‘ప్రజలకు భరోసా ఇచ్చే స్టేషన్ కావాలి’ అనే సంకల్పంతో ఇద్దరూ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు.ఇప్పటికే మట్టితో స్టేషన్ ఆవరణ మొత్తం చదును చేసి,కొత్త రూపు తీసుకొచ్చారు.చూసిన వాళ్ళు ‘ఇదేనా మన మరిపెడ పోలీసు స్టేషన్’ అని ముక్కున వేలేసుకుంటున్నారు.అంతటితో ఆగలేదు.భవనానికి రంగులు,సరికొత్త విద్యుత్ లైన్లు,తాగునీటి వసతి,ప్రజలు హాయిగా కూర్చునే వెయిటింగ్ హాల్,పక్కా డ్రైనేజీ,విశాలమైన పార్కింగ్...ఒక్కొక్కటిగా పనులు పరుగులు పెడుతున్నాయి. సీఐ పవన్ కుమార్,ఎస్సై సతీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.‘స్టేషన్ గడప తొక్కితే ప్రజలకు గౌరవం దక్కాలి,భయం కాదు భరోసా కలగాలి’ అనేది వారి మాట.అందుకే స్టేషన్‌ను కార్పొరేట్ ఆఫీస్‌ను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.పనులు చివరి దశకు రావడంతో త్వరలోనే ‘న్యూ లుక్’ పోలీస్ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.‘అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే’అంటూ సీఐ,ఎస్సైల చొరవను మనసారా అభినందిస్తున్నారు.శాఖాపరంగా కూడా ఈ వేగంపై సంతృప్తి వ్యక్తమవుతోంది.

