Type Here to Get Search Results !

మరిపెడ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం.

మరిపెడ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం.
96% లక్ష్యం పూర్తి చేశామన్న వైద్యాధికారి గుగులోత్ రవి నాయక్.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వైద్యాధికారి డా.రవి

డోర్నకల్/మరిపెడ,జూన్ 28(నమస్తే న్యూస్)

మరిపెడ మండలం,మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది.మరిపెడ పీహెచ్‌సీ వైద్యాధికారి డా.గుగులోతు రవి నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 96 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.మున్సిపల్ కేంద్రంలో చైర్‌పర్సన్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా పోలియో చుక్కల పంపిణీ ప్రారంభమైంది.గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లు,వార్డు మెంబర్లు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుండి నడిపించారు.పర్యవేక్షణ తొర్రూర్ డిప్యూటీ డీఎం&హెచ్‌ఓ డా.సుధీర్ రెడ్డి క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు.ఈ కార్యక్రమం తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది:డాక్టర్లు పూజిత,సౌజన్య,స్వామి,కిరణ్‌లతో పాటు పీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ,హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు,లలిత కుమారి,మాధవి,వెంకన్నలు పర్యవేక్షించారు.స్టాఫ్ నర్స్ పద్మ,పల్లె దవాఖానా సిబ్బంది,ల్యాబ్ టెక్నీషియన్లు,ఏఎన్‌ఎంలు,ఆశా కార్యకర్తలు,అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.వంద శాతం లక్ష్యం చేరుకునేందుకు మిగిలిన పిల్లల వివరాలు సేకరిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.