Type Here to Get Search Results !

ప్రగతి సేవా సమితి సారధ్యంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ.

ప్రగతి సేవా సమితి సారధ్యంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ!




నర్సింహులపేట,జూన్ 15,(నమస్తే న్యూస్)

నర్సింహులపేట మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ ఆవరణంలో జిల్లా అందత్వ నిర్మాణంలో భాగంగా ప్రగతి సేవా సమితి సారాధ్యంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు.కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని శంకర కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్ చేపించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ప్రగతి సేవా సమితి సిబ్బంది ద్వారా గ్రామాలలో జనరల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ గ్రామ ప్రజల ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నర్సింహులపేట  గ్రామ సర్పంచ్  పెద్దమాముల యాకయ్య  మరియు గ్రామ పాలకమండలి సభ్యులు కంటికి సంబంధించిన క్యాంపు నరసింహుల పేటలో నిర్వహిస్తాము అని అడగగానే స్పందించి ప్రగతి సేవా సమితికి  సహకరించారు ఇకముందు జనరల్ చెకప్  డాక్టర్ల ద్వారా గ్రామపంచాయతీలో నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరసింహుల పేట గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య అందత్వ నిర్మూలనలో భాగంగా కంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వృద్ధులు కంటి సమస్యల తోఎంతో ఇబ్బంది పడుతున్నారని వారికి ఈ విధమైన సేవ చేయడం చాలా మంచి ఉదేశ్యం అని ఇకముందు ఇలాంటి కార్యక్రమాలు  గ్రామాలలో నిర్వహిస్తూ వృద్ధులకు కంటి సమస్య నుండి విముక్తులను చేసి వారి కళ్ళలో వెలుగులను నింపాలని కొనియాడారు. వృద్ధులు ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటారో వారి కుటుంబాలలో వారి యొక్క ఆర్థికంగా ఎదుగుతారని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ! వారి సమస్యలను పరిష్కరించాలని కుటుంబ సభ్యులకు  సూచించారు.ప్రగతి సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఉప సర్పంచ్ కాసా యాకన్న పాలకమండలి సభ్యులు డాక్టర్ విజ్ఞవి ఆప్తమాలజిస్ట్, రాజు వి హెచ్ వి, తులసి వి సి టి, అమన్దీప్, నిరూపం ప్రగతి సేవా సమితి జిల్లా కోఆర్డినే కోఆర్డినేటర్ పసునూరి యాకయ్య నర్సింహులపేట మండల కో ఆర్డినేటర్ కొత్త ఎల్లయ్య కురవి మండల కోఆర్డినేటర్ గుండెబోయిన అజయ్ పెద్ద నాగారం గ్రామ కో ఆర్డినేటర్ పగిడిపల్లి మాధవి జయపురం గ్రామ కోఆర్డినేటర్ మందుల సంధ్య మరియు నరసింహు లపేట గ్రామ ప్రజలు వివిధ గ్రామాలనుండి వచ్చిన వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.