Type Here to Get Search Results !

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ ఉక్కుల అశోక్‌కు ఘన సన్మానం.

  • టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ ఉక్కుల అశోక్‌కు ఘన సన్మానం.
  • శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర డయాగ్నస్టిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  కృష్ణారెడ్డి.




హైదరాబాద్, జూన్ 15 (నమస్తే న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ ఉక్కుల అశోక్‌ను పలువురు వైద్య ప్రముఖులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డయాగ్నస్టిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకాపు కృష్ణారెడ్డి, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రమేష్, అజీజ్ తదితరులు డాక్టర్ ఉక్కుల అశోక్‌కు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ఉక్కుల అశోక్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం,సమాజానికి మరింత బలం చేకూర్చుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో  ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, సామాజిక కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.