ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వనం.
(మహబూబాబాద్, జూన్.09, నమస్తే న్యూస్)
సాహసాన్ని ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు మరియు స్వచ్చంద సంస్థలకు జిల్లా మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ 2026–27 సంవత్సరానికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కొరకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు *జిల్లా సంక్షేమ అధికారి యం. సబిత* నేడు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణ అసాధారణ ప్రతిభాపాటలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామజిక సేవ, ధైర్యసాహస కార్యక్రమాలు తదితర అంశాలో అవార్డులను అందజేయబడుతుందని తెలిపారు. ఈ అవార్డుల కోసం బాలలు 5 ఏళ్ళు ఆపైబడి 18 ఏళ్ళు లోపు ఉన్న బాలబాలికలు ( 31 జూలై 2026 లోపు) ఉండాలి. అవార్డును పొందేందుకు స్వచ్ఛంద సంస్థలు కల్గి ఉండాల్సిన అర్హతలు ఏడేళ్ళ ఆపైన బాల, బాలికల కోరకు అద్భుతంగా కృషి చేసి బాలల జీవితాల్లోకి మార్పుచెందినవై ఉండాలన్నారు. అర్హులైన బాల, బాలికలు ఆన్ లైన్లో https://awards.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 31 జూలై 2026 లోపు దరఖాస్తులు చేసుకొగలరని కోరారు. ఇట్టి వెబ్ సైట్ నందు దరఖాస్తును సమర్పించిన వారు, ఒక కాపీని జిల్లా బాల రక్షా భవన్, సఖి (వన్ స్టాప్ సెంటర్), మొదటి అంతస్తుపైన, నర్సంపేట రోడ్, మహబూబాబాద్ నందు సమర్పించగలరని ఈ సందర్భంగా అధికారి తెలిపారు.

