డోర్నకల్/మరిపెడ(జూన్ 10)నమస్తే న్యూస్.
మండలంలోని స్టేజి తండ సర్పంచి జాటోత్ అమ్మి,, ఎల్లంపేట సర్పంచి గండి రాధమ్మ,,భాల్యతండ సర్పంచి కాలు నాయక్,సోమ్లాతండా సర్పంచి భూక్యా భూయి గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలన ప్రగతి పరిపాలన సభలు బుధవారం ఘనంగా జరిగాయి.పంచాయితీల్లో జరిగిన సభలో వారు మాట్లాడుతూ ప్రజా పాలన లక్ష్యం ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు చేరవేయడమేనని తెలిపారు.గ్రామ ప్రగతి ప్రణాళిక ద్వారా మౌలిక వసతులు,తాగునీరు,పారిశుద్ధ్యం,విద్య,వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.అనంతరం ఏపీవో అనూష మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక అమలులో మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.ఉపాధి హామీ పనులు,డ్వాక్రా రుణాలు,స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.అనంతరం జరిగిన ప్రజా పాలన ప్రగతి పరిపాలన సభలో మరిపెడ సి ఐ,ఎస్సై లు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని,మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని హెచ్చరించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని,ఓటీపీలు,బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.పోక్సో చట్టంపై వివరిస్తూ,18 ఏళ్లలోపు బాల బాలికలపై జరిగే లైంగిక వేధింపులు క్షమించరాని నేరమని,నిందితులకు కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే భయపడకుండా తమకు తెలియజేయాలని,సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.సమాచారం కోసం సంబందిత అధికారులకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.పై కార్యక్రమాల్లో ఎంపీఓ సోమ్లా నాయక్,వైద్యాధికారులు,ఏపీవో అనూష,ఏఓలు,ఏఎన్ఎంలు,అంగన్‌వాడీలు,ఆశా వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికులు,గ్రామాల పెద్దలు,మహిళలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


