Type Here to Get Search Results !

కొట్య తండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ.

కొట్య తండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ.

సమస్యల పరిష్కారం,గ్రామ అభివృద్దే లక్ష్యం.

గ్రామ సర్పంచి తేజవత్ భాలాజీ.



డోర్నకల్/మరిపెడ(జూన్ 06)నమస్తే న్యూస్:మరిపెడ మండలం కొట్య తండా గ్రామపంచాయతీ పరిధిలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సర్పంచ్ తేజవత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తేజవత్ బాలాజీ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామ ప్రజలు,వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ,గ్రామసభ దృష్టికి వచ్చిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.కొత్తగా పెన్షన్‌ కొరకు ఎదిరి చూస్తున్న,దరఖాస్తు చేసుకునేవారు నిరాశపడవద్దని,త్వరలోనే అర్హులైన వారికి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందని తెలిపారు.వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ఇళ్లు,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.సాదా బైనామాల ద్వారా రైతులకు పట్టా పాస్‌బుక్‌లు అందజేయడం జరుగుతుందని,కావున అర్హులైన రైతులు రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించాలని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు,ఆశా వర్కర్లు,అంగన్ వాడిలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.