సీజనల్ వ్యాధులు,పౌష్టికాహారంపై అధికారుల అవగాహన.
డోర్నకల్/మరిపెడ(జూన్ 06)నమస్తే న్యూస్:మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్డులో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ నిర్వహించారు.వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేశారు.సభలో ప్రజలు డ్రైనేజీ,తాగునీరు,రోడ్లు,వీధి దీపాల సమస్యలను నేరుగా చైర్ పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రగతి శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.అదేవిధంగా వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ,మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పించారు.పరిసరాల పరిశుభ్రత పాటించాలని,నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.గర్భిణులు,బాలింతలు,చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు,వార్డు కౌన్సిలర్లు,అధికారుల,సిబ్బంది,వార్డు ప్రజలు పాల్గొన్నారు.ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేందుకు ఇలాంటి సభలు ఉపయోగపడతాయని చైర్ పర్సన్ తెలిపారు.కార్యక్రమంలో తహశిల్దార్ కృష్ణవేణి,సి ఐ పవన్ కుమార్,ఎస్సై సత్తెష్,మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,ఎం ఈ ఓ అనితరెడ్డి,వైద్యాధికారి స్వామీ,ఏ ఈ ఓ అరవింద,వై చైర్మన్ కాలం సునిత రవింధర్ రెడ్డి,మాజీ సర్పంచి పానుగోత్ రాంలాల్,టౌన్ అధ్యక్షులు షేక్ తాజోద్దీన్,షేక్ ఆఫ్జల్, అలవాలా ఉపేంధర్,వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మెప్మాలు,అంగన్ వాడిలు,ఆర్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

