- పురుషోత్తమాయగూడెం రైతు వేదికలో 4వ రోజు వార్డు సభ్యులకు శిక్షణ.
- శాఖల వారీగా అవగాహన కల్పించిన అధికారులు.
- విధులు,బాధ్యతలపై దిశానిర్దేశం.
- గ్రామాభివృద్ధే లక్ష్యంగా,వార్డు సభ్యులకు శాఖల పనితీరుపై శిక్షణ.
డోర్నకల్/మరిపెడ(జూన్25)నమస్తేన్యూస్.
మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో నాల్గవ రోజు వార్డు సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీవో సోమ్లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీవో సోమ్లాల్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర,విధులు,బాధ్యతల గురించి వివరించారు.ట్రైనర్లు రామోజీ,వెంకన్న, సుమన్‌లు గ్రామపంచాయతీకి సంబంధించిన వివిధ శాఖల పనితీరు,పథకాల అమలు,నిధుల వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పించారు.పంచాయతీ కార్యదర్శులు రాజేంద్రప్రసాద్,రామకృష్ణలు రికార్డుల నిర్వహణ,గ్రామ సభలు,తీర్మానాల అమలు తదితర అంశాలపై వివరించారు.ఆపరేటర్ ఉమా ఆన్‌లైన్ సేవలు,డిజిటల్ పంచాయతీ కార్యకలాపాలపై వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు.గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ట్రైనర్లు రామోజీ, వెంకన్న, సుమన్, పంచాయతీ కార్యదర్శులు రాజేంద్రప్రసాద్,రామకృష్ణ,ఆపరేటర్ ఉమాతో పాటు పరిసర గ్రామాల వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

