బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను విజయవంతం చేద్దాం.
-ఉక్కుల అశోక్
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే న్యూస్):మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ పారామెడిక్ గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సేవే లక్ష్యం – ప్రజలే శక్తి" అనే నినాదంతో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న డా.కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్, రైతు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హెల్త్ వారియర్స్, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ప్రజల సమస్యల పరిష్కారంలో, సామాజిక న్యాయం సాధనలో, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి అహర్నిశలు కృషి చేస్తున్న డా. కవ్వంపల్లి సత్యనారాయణ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జూన్ 10వ తేదీన గాంధీ భవన్‌లో జరగనుండగా, వివిధ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.

