- ప్రత్యేక గ్రామసభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ.
- ప్రజల సమస్యల ప్రణాళికల పై ప్రత్యేక సమీక్ష.
- అభివృద్ధి దిశగా నర్సింహులపేట గ్రామపంచాయతీ.
నర్సింహులపేట, జూన్ 8(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సభలో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పెదమాముల యాకయ్య మాట్లాడుతూ, "మన గ్రామం – మన అభివృద్ధి – మన భవిష్యత్తు" అనే లక్ష్యంతో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రాధిక మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని పేర్కొన్నారు.అనంతరం వ్యవసాయ అధికారి (ఏవో) వినయ్ కుమార్ రైతులకు వర్షాకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాలను వినియోగించడం, సకాలంలో ఎరువులు, పురుగుమందులు వాడడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అశోక్, ఉప సర్పంచ్ కాస యాకయ్య, ఐ సి డి సి సూపర్వైజర్ శ్రీదేవి, ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, వార్డ్ మెంబర్స్, గ్రామపంచాయతీ సభ్యులు, అధికారులు, రైతులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


