Type Here to Get Search Results !

జూన్ 10న కలెక్టరేట్ ముందు సీపీఐ ధర్నా.

  • జూన్ 10న కలెక్టరేట్ ముందు సీపీఐ ధర్నా.
  • ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు తరలిరావాలి. 
  • సీపీఐ జిల్లా సమితి నేత అబ్దుల్ రషీద్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 08)నమస్తే న్యూస్.

ప్రజా సమస్యల పరిష్కారానికి జూన్ 10న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండీ అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు.

సీపీఐ మహబూబాబాద్ జిల్లా సమితి పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జూన్ 10న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే భారీ ధర్నాను ప్రజలు,రైతులు,కార్మికులు,మహిళలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా సి పి ఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్i రషీద్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని,అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాజీలేకుండా అమలు చేసి అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని,పేదలకు పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.జూన్ 10న కలెక్టరేటు ముందు చేయ తలపెట్టిన ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎండీ అబ్దుల్ రషీద్ కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.