- మరిపెడలో 99రోజుల ప్రజా పాలనలో వార్డు సభలు.
- మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ(జూన్ 04)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన"ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక",99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గురువారం 1,2,3వ వార్డులలో వార్డు సభలు నిర్వహించారు.ఈ సభల్లో -పురపాలక ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి-ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని,మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.99 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం,వీధి దీపాలు,తాగునీటి సరఫరా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణవేణి,పురపాలక అధికారి నరేష్ రెడ్డి,మండల విద్యాధికారి అనిత రెడ్డి,మరిపెడ వైద్యాధికారి రవి కుమార్,విద్యుత్ సహాయ ఇంజనీరు మహామూద్,వ్యవసాయ విస్తరణ అధికారి అరవింద్ పాల్గొన్నారు.వార్డు సభ్యులు తిరుపతి,శ్రీను,పానుగోతు రాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధసిరి బిక్షపతి,చెన్నూరు మహేష్,అనంతగిరి శ్రీను.అంగన్వాడీ కార్యకర్తలు,గ్రామ వనరుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

