కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిని కలిసిన యువ పర్వతారోహకుడు యశ్వంత్ నాయక్.
డోర్నకల్/మరిపెడ(జూన్ 17)నమస్తే న్యూస్.
యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ తన ఇటీవలి పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి గుగులోత్ రవి ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన యాత్ర విశేషాలు,సాధించిన విజయాలను ఆయనకు వివరించారు.గుగులోత్ రవి ఐఏఎస్ యశ్వంత్ నాయక్ సాధించిన విజయాన్ని అభినందించి,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.యువతకు ఆదర్శంగా నిలిచేలా సాహస క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.
ఈ సందర్భంగా యశ్వంత్ నాయక్ మాట్లాడుతూ,"గుగులోత్ రవి ఐఏఎస్ అందించిన ప్రోత్సాహం,మార్గదర్శనం,ఆశీర్వాదాలు నాకు ఎంతో విలువైనవి.నా పర్వతారోహణ ప్రయాణాన్ని,ఇటీవలి విజయాన్ని ఆయనతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తినిస్తుంది"అని తెలిపారు.గుగులోత్ రవి ఐఏఎస్ అందించిన మద్దతు,ప్రోత్సాహానికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని,ఈ సమావేశం తన జీవితంలో చెరగని ముద్ర వేసిన స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచిపోతుందని యశ్వంత్ నాయక్ పేర్కొన్నారు.

