Type Here to Get Search Results !

నర్సింహులపేట నూతన ఎంపీడీవోగా రాంప్రసాద్‌రావు బాధ్యతల స్వీకారం.

నర్సింహులపేట నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్‌రావు.

  • క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. 
  • ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా సంప్రదించవచ్చు.



నర్సింహులపేట, జూన్ 17 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా జి. రాంప్రసాద్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు గంగారం మండలంలో మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)గా విధులు నిర్వహించిన రాంప్రసాద్‌రావు పదోన్నతి పొంది నర్సింహులపేట మండల ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.కాగా ఇటీవల ఏసీబీ దాడులలో పట్టుబడిన ఎంపీడీవో మరియు ఎంపీవో విచారణలో ఉండగా నేడు నూతన ఎంపీడీవోగా రాంప్రసాద్ రావు బాధ్యతలు స్వీకరించారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.