Type Here to Get Search Results !

రైతు ఆశీర్వాద సభ జయప్రదానికి రైతులు పాటుపడాలి:కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి

  • రైతు ఆశీర్వాద సభ జయప్రదానికి రైతులు పాటుపడాలి.
  • ఓటర్ల జాబితానమోదు,సవరణ,మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి 

తిరుమలాయపాలెం జూన్ 25 (నమస్తే న్యూస్)

రైతు ఆశీర్వాద సభ జయప్రదానికి రైతులందరూ పాటుపడాలని  ఓటర్ల జాబితా నమోదు సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు   ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  మాట్లాడుతూ ఈనెల 30న చింతకాని మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గోననున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. తిరుమలాయపాలెం నుండి  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు..ఈ సభ వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు 9000 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారని పేర్కొన్నారు.రైతు శ్రేయస్సే ధ్వేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తిరుమలాయపాలెం  మండల రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ఓటర్ల జాబితా నమోదు,సవరణలు,మ్యాపింగ్ ప్రక్రియ పై కాంగ్రెస్ శ్రేణులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.బీహార్,పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలోను స్పెషల్ ఇంటెన్సివ్ తరహాలోనే తెలంగాణ లోను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటు హక్కులకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు..ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.