Type Here to Get Search Results !

ఎన్నికల సంఘం చేపట్టిన సర్ తొలి రోజు విజయవంతం.

ఎన్నికల సంఘం చేపట్టిన సర్ తొలి రోజు విజయవంతం



తిరుమలాయపాలెం,జూన్ 25 (నమస్తే న్యూస్)కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం గురువారం తొలిరోజు విజయవంతంగా ముగిసింది.మండలం లోని మొత్తం 40  గ్రామ పంచాయతీలలో 64 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.వీటి లో బీఎల్వే లు తొలి రోజు లాంచనంగా ప్రారంభించారు.64 మంది బీఎల్ వో లు ఫారాలు పంపిణీ కార్యక్రమం ను చేపట్టారు. తహసిల్దార్ లూథర్ విల్సన్  తో పాటు సూపర్వైజర్లు సర్ కార్యక్రమం ను పర్యవేక్షించారు. ఏలువారిగూడెం ఉపసర్పంచ్ దేవరం దేవేందర్ రెడ్డి సోలిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అశోక్ కు ఎన్యూమరేషన్ పారాం ను బీఎల్వో అందించారు.ఈ కార్యక్రమం లో సోలిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అశోక్  ఏలు వారి గూడెం పంచాయతీ కార్యదర్శి స్నేహలత  సోలిపురం పంచాయతీ కార్యదర్శి చంటి తదితరులు పాల్గొన్నారు. మండలం లోని ఇంటింటి కార్యక్రమం ను ఆయా పంచాయతీ సర్పంచ్ ల కు ఫారాలు అందించి కార్యక్రమాలను ప్రారంభించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.