Type Here to Get Search Results !

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో,ఎంపీఓ.

  • మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.
  • వెంచర్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో,ఎంపీఓ.
  • వసూళ్లను సక్కబెడుతున్న ఎంపిడివో కుమారుడు.
  • టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.




మహబూబాబాద్, జూన్ 12 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధిక, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) కిన్నెర యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. పడమటి గూడెం గ్రామలోని ఓ వెంచర్‌కు అనుమతులు మంజూరు చేయడానికి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మొదటి విడతగా రూ.45 వేల నగదును స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.ఎంపీడీవో కార్యాలయంలో పలు పరిపాలనా వ్యవహారాలను అనధికారికంగా చక్కబెడుతూ వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ కూడా ఈ కేసులో ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.దాడుల అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలోని పలు పత్రాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడికానున్నాయి.ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఇదిలా ఉండగా, నర్సింహులపేట ఎంపీడీవో రాధిక ఏసీబీ వలలో చిక్కిన వార్త తెలియగానే పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కొందరు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకుంటూ అవినీతిపై ఏసీబీ చర్యలను స్వాగతించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.