Type Here to Get Search Results !

డోర్నకల్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన.

  • డోర్నకల్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన.
  • గంగమ్మ గుడికి రూ.20 వేల విరాళం.
  • అనంతరం సీరోల్లో భూక్యా కాంతికి నివాళులు.




డోర్నకల్/మరిపెడ(జూన్ 09)నమస్తే న్యూస్.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గంగమ్మ గుడి నిర్మాణానికి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ రూ.20,000 ఆర్థిక సహాయాన్ని ఆలయ నిర్వహణ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై భక్తులకు సేవలందించాలని ఆకాంక్షించారు.సామాజిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మన్యు ప్యాట్నీ,సకినాల వెంకన్న,పచ్చిపాల మల్లేశం,పడాల యాకేష్,బోడి యోగేష్,ఎల్లావుల శివ,గణేష్,పచ్చిపాల శివ తదితరులు పాల్గొన్నారు.

 సిరోల్ మండలం పెద్ద లాలు తండా గ్రామానికి చెందిన భూక్యా సోమోజీ తల్లి భూక్యా కాంతి ఇటీవల మరణించగా,నేడు వారి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కురవి మండల బీఆర్ఎస్ నాయకులు ఐలి నరహరి గౌడ్,బోడ శ్రీను,గుగులోత్ నెహ్రూ నాయక్,బాదే నాగన్న,బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా బాలాజీ నాయక్,కాంపెల్లి సొసైటీ మాజీ చైర్మన్ భూక్యా బికోజి,మాజీ వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య,ధీరావత్ వీరన్న,మామిడి వెంకన్న,భూక్యా చందులాల్,రాములు,మాదాల సుజిత్,నేర్సు శ్రీశైలం,ధీరావత్ దస్రూ,మల్లెపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.