Type Here to Get Search Results !

మరిపెడ ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత మాతృత్వ దశాబ్ది వేడుకలు.

  • మరిపెడ ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత మాతృత్వ దశాబ్ది వేడుకలు.
  • గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు,మందుల పంపిణీ.



డోర్నకల్/మరిపెడ(జూన్ 09)నమస్తే న్యూస్.

మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఉచితంగా ప్రత్యేక వైద్య పరీక్షలు,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు రవి,పూజిత గర్భిణులకు స్వయంగా సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.అందులో భాగంగా రక్తపోటు,మధుమేహం పరీక్షలు,ఉచిత ప్రయోగశాల పరీక్షలు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరిశీలన.కాన్పు సమయంలో ప్రమాదం ఉన్న గర్భిణులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స,సలహాలు అందించారు.గర్భిణులందరికీ అవసరమైన ఉచిత మందులు,ఐరన్,కాల్షియం మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన గర్భిణులు తప్పకుండా మరిపెడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.గర్భధారణ సమయంలో సమతుల్య పోషకాహారం తీసుకోవడం,సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా తల్లి,బిడ్డ మరణాలను అరికట్టవచ్చని సూచించారు.ప్రసవ సమయంలో అత్యవసర సహాయం కోసం ప్రభుత్వ ఉచిత వాహనం 102 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు ఆచార్యులు,ప్రయోగశాల సాంకేతిక నిపుణులు లక్ష్మి కుమారి,సహాయ నర్సు అశ్విని,స్థానిక ఆశా ఆరోగ్య కార్యకర్తలు,ఆసుపత్రి సిబ్బంది పాల్గొని గర్భిణులకు సేవలందించారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.