Type Here to Get Search Results !

గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో 50 హెల్మెట్ల పంపిణీ.

  • గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో 50 హెల్మెట్ల పంపిణీ.
  • కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మరిపెడ ఎస్సై సతీష్.


డోర్నకల్/మరిపెడ(జూన్ 04)నమస్తే న్యూస్:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు గ్రామంలో గురువారం రోడ్డు భద్రతపై గ్రామ సర్పంచి ఉప్పల సోమన్న ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు 50 హెల్మెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్ హాజరయ్యారు.ఎస్ఐ సతీష్ స్వయంగా హెల్మెట్ ధరించి యువకులతో కలిసి గ్రామ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎస్ఐ సతీష్ ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని,తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు తలకు గాయాలతోనే జరుగుతున్నాయని,హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని వివరించారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,అతివేగం ప్రమాదకరమని యువతకు పిలుపునిచ్చారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు.రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేపడతామని తెలిపారు.అలాగే యువత చెడు వ్యాసనాలకు భానిసలు కావద్దని,మీపై మీ తల్లి తండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి వారి ఆశలను అది ఆశలు చేయవద్దని,అలాగే యువత గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని,మీరు సరైన మార్గంలో నడుస్తూ మీ ముందు తరం వారికి మీరు ఆదర్శంగా నిలవాలన్నారు.కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,ఉపసర్పంచ్ బాధావత్ హుస్సేన్,గ్రామస్తులు,యువకులు పాల్గొన్నారు.ఎస్ఐ సతీష్ చేసిన అవగాహనతో యువతలో చైతన్యం వచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.