Type Here to Get Search Results !

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి : సూరబోయిన సతీష్

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి 

: సూరబోయిన సతీష్

మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సతీష్


నర్సింహులపేట,28 మే (నమస్తే న్యూస్) 
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ మండల స్థాయి సమావేశంలో  భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీని గ్రామ, బూత్ స్థాయిలో మరింత పటిష్టం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు.పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బూత్ కమిటీలను బలోపేతం చేసి పార్టీకి గ్రామస్థాయిలో మరింత ఆదరణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ మాజీ కన్వీనర్ బల్గురు వెంకటరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చిలువేరు కరుణాకర్, మండల ప్రధాన కార్యదర్శి ఏరనాగి కుమారస్వామి, మండల ఉపాధ్యక్షులు నెలకుర్తి సత్యనారాయణ రెడ్డి, దాసరి వీరన్న, దొనికేన శ్రీనివాస్, కాలు నాయక్, మండల బీజేవైఎం అధ్యక్షుడు పొడుపుగంట అంజి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.