Type Here to Get Search Results !

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో 6 ఎకరాల జామ తోటలు దగ్ధం.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో 6 ఎకరాల జామ తోటలు దగ్ధం.
కౌసల్యాదేవిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.
తీవ్ర విషాదం లో రైతన్న.



నర్సింహులపేట,మే29(నమస్తే న్యూస్) కౌసల్యాదేవిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్య దేవిపల్లి  గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 6 ఎకరాల జామ తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి.గ్రామానికి చెందిన రైతులు కటుకూరి సంజీవరెడ్డి మరియు వేర్పుల శ్రీరాములు వారికి చెందిన జామ తోటలు మంటల్లో కాలిపోయాయి. స్థానికుల వివరాల ప్రకారం, తెల్లవారుజామున ప్రాంతంలో భారీ ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. దీంతో చెలరేగిన మంటలు సమీపంలోని జామ తోటలకు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో కటుకూరి సంజీవరెడ్డికి చెందిన సుమారు 5 ఎకరాల జామ తోటతో పాటు వేర్పుల శ్రీరాములు కు చెందిన మరో ఒక ఎకరా జామ తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, గ్రామస్తులు కలిసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.ఈ ఘటనలో లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.