Type Here to Get Search Results !

ప్రజలకు పరిశుద్ధమైన నీటిని అందించడమే మా లక్ష్యం: సర్పంచ్ పెద్దమాముల యాకయ్య.

ప్రజా ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం.


నీటి ట్యాంకులను శుభ్రపరిచిన పంచాయతీ సిబ్బంది.


పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ యాకయ్య.

నర్సింహులపేట, మే 12 (నమస్తే న్యూస్): ప్రజా ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ పెద్దమాముల యాకయ్య తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గ్రామ నీటి నిల్వ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ట్యాంకులను బ్లీచింగ్ పొడి ద్వారా శుద్ధి చేశారు. అంటువ్యాధులు, దురద, అలర్జీ వంటి సమస్యలు నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటి సరఫరా సిబ్బందితో కలిసి సర్పంచ్ స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పెద్దమాముల యాకయ్య పేర్కొన్నారు.


నీటి ట్యాంకులను శుభ్రపరుస్తున్న జిపి సిబ్బంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.