Type Here to Get Search Results !

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం భక్తుడు షేక్ ఖాదర్ బాబా.

మతసామరస్యానికి ప్రతీకగా బేతోలు హనుమాన్ జయంతి వేడుకలు.


ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం భక్తుడు షేక్ ఖాదర్ బాబా.




మహబూబాబాద్, 12 మే (నమస్తే న్యూస్):

దేశ ఐక్యతకు, జాతీయతకు, మతసామరస్యానికి ప్రతీకగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు బేతోలులో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు నిలిచాయి. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం భక్తుడు షేక్ ఖాదర్ బాబా ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం స్థానికంగా ఆకట్టుకుంది.గ్రామ ప్రజలతో కలిసి భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసిన షేక్ ఖాదర్ బాబా, దేశంలో అన్ని మతాలు పరస్పర గౌరవంతో, సోదరభావంతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, యువత మంచి మార్గంలో నడవాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొనాలని ప్రార్థించారు.హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం వద్ద, మంగళహారతులు, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తి వాతావరణంలో నిర్వహించగా, వివిధ వర్గాల ప్రజలు  పాల్గొన్నారు. మతాలు వేర్వేరు అయినా మనసులు ఒక్కటేనని, భారతీయ సంస్కృతి “సర్వమత సమభావం”ను చాటిచెప్పేదిగా ఈ వేడుకలు నిలిచాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.