Type Here to Get Search Results !

వరి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటా:పిఎసిఎస్ చైర్మన్‌గా సంపెట రాము గౌడ్

నర్సింహులపేటలో బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ సంపెట రాము గౌడ్.



నర్సింహులపేట, మే 06 (నమస్తే న్యూస్):

వరి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పిఎసిఎస్ చైర్మన్‌ సంపెట రాముగౌడ్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో PACS కార్యాలయంలో  చైర్మన్‌గా సంపెట రాము గౌడ్  బాధ్యతలు స్వీకరించారు.

వరి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పిఎసిఎస్ చైర్మన్‌గా సంపెట రాము గౌడ్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌గా సంపెట రాము గౌడ్  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘం సీఈఓ వెంకన్న సమక్షంలో పదవిని చేపట్టిన రాము గౌడ్, తన పదవీకాలమంతా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాకు లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా రైతుల సేవకే అంకితం చేస్తాను. గతంలో చేపట్టిన కార్యక్రమాలను మరింత మెరుగుపరుస్తూ, రైతులకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తాను” అని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం, చెల్లింపులు, రవాణా వంటి అంశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఎదురైతే రైతులు నేరుగా తనకు సమాచారం అందించాలని కోరారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించడం మా ప్రాధాన్యం. సంఘం రైతులకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, స్థానిక రైతులు, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.