Type Here to Get Search Results !

చింతపల్లి గూడలో వాల్ బాల్ క్రీడా మైదానం.

చింతపల్లి గూడలో వాల్ బాల్ క్రీడా మైదానం పనులు ప్రారంభం.


శంషాబాద్ జోనల్‌, మే 06 (నమస్తే న్యూస్): శంషాబాద్ జోనల్ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్‌, కొంగరకాలన్ 54వ డివిజన్‌లోని చింతపల్లి గూడ గ్రామంలో యువతకు క్రీడా ప్రోత్సాహం కల్పించే దిశగా వాల్ బాల్ క్రీడా గ్రౌండ్ అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. GHMC వర్క్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో సిబ్బంది పనులు చేపట్టారు.ఈ సందర్భంగా డా. ఉక్కుల అశోక్ మాట్లాడుతూ, మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి యువతి యువకులు, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జోగు నర్సింహ, ఉడుతల రాజు గౌడ్, జోగు జంగయ్య, రవి గౌడ్‌తో పాటు GHMC సిబ్బంది జోగు ముత్తయ్య, జేసీబీ డ్రైవర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.