జకాత్, ఫిత్రా వంటి సేవా భావాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
:తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.
రిపోర్టర్:సాయి రెడ్డి(89772 89630)
సెంటర్.సూర్యాపేట.
సూర్యాపేట,మే 28(నమస్తే న్యూస్)
పవిత్ర ఖురాన్ బోధించిన జకాత్, ఫిత్రా వంటి సేవా భావాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… పవిత్ర ఖురాన్ బోధించిన జకాత్, ఫిత్రా వంటి సేవా భావాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ, పేదల ఆకలి తీర్చే గొప్ప పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు.సహనం, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ బక్రీద్ పండుగను శాంతి, కరుణ, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి రమణారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న , పిల్లల రమేష్ భవాని నాయుడు , షేక్ ఫారుఖ్, పలగాని కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్సాద్ దేవేందర్, తండు శ్రీనివాస్,యాట ఉపేందర్, మర్ల కరుణాకర్, దండ అరవింద్ రెడ్డి , ధరావత్ ధర్మ,జానీ, కుంచం అంజయ్య, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






