Type Here to Get Search Results !

త్యాగం, మానవత్వానికి ప్రతీక బక్రీద్ : కాంగ్రెస్

త్యాగం, మానవత్వానికి ప్రతీక బక్రీద్ : కాంగ్రెస్




రిపోర్టర్:సాయి రెడ్డి(89772 89630)

సెంటర్.సూర్యాపేట.

సూర్యాపేట,మే 28 (నమస్తే న్యూస్)

బక్రీద్‌ పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ త్యాగం, భక్తి, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.ఈద్‌ ఉల్‌ అజ్‌హా మనిషిలో సేవాభావం, దానధర్మం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పండుగ అని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలనే సందేశాన్ని బక్రీద్‌ ఇస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో నడుచుకుంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే గుణాన్ని అలవరచుకోవాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.బక్రీద్‌ సందర్భంగా ఈద్గా వద్ద నాయకులు ముస్లిం సోదరులతో కలిసి పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.