Type Here to Get Search Results !

మహిళల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి : ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

మహిళల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి 

: ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ 



దంతాలపల్లి, మే 26(నమస్తే న్యూస్ )

మహిళల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు.మంగళవారం దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం,రామానుజపురం, గున్నేపల్లి,దంతాలపల్లి,బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రు .10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన 1 మండల సమాఖ్య ,9 మహిళ సమాఖ్య భవనాలతో పాటు పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నూతన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు.మహిళలు ఆత్మగౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు  . నిరుపేదల సొంతింటి కల సహకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు బట్టు నాయక్ పిఐసిఎస్ చైర్మన్ రాము గౌడ్, సర్పంచులు కందిమల్ల భరత్ బాబు, అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి,పొన్నాల ప్రణవి ,పొన్నోటి బాలాజీ,జెట్టి మహేశ్వరి-ఆజాద్ చంద్రశేఖర్, నాయకులు గురుపాల్ రెడ్డి,లింగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి,కసిరెడ్డి నవీన్ రెడ్డి, కొడుపుగంటి హరికృష్ణ, నెమ్మది యాకయ్య, దుండి వెంకటేశ్వర్లు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపేట సురేష్ గౌడ్, మల్లం శ్రీను,యాకయ్య,రాములు,బొల్లు వీరన్న, పడిదం లింగమూర్తి, మహిళా నాయకురాలు గిర్వాణి, మండల మహిళా అధ్యక్షురాలు కవిత, సీసీ బీముడు,అధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.