Type Here to Get Search Results !

పంట చేలల్లో సౌర విద్యుత్‌-ఏ.ఈ పాండు.

పంట చేలల్లో సౌర విద్యుత్‌..రైతన్నలకు చేయూత.

-ఏఈ పాండు.



నర్సింహులపేట,మే 07(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఈ పాండు నాయక్ రైతులు తమ పంట పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అన్నదాత విద్యుత్ ప్రదాత” కార్యక్రమం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని తీసుకొచ్చాయని తెలిపారు పంట చేలల్లో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులు విద్యుత్ అవసరాలను తాము తీర్చుకోవడంతో పాటు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ రాయితీలు,సబ్సిడీలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్  సిబ్బంది, పలు గ్రామాల సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.