రెనోవా గ్రూప్ అధినేత శ్రీధర్ పెద్దిరెడ్డికి ప్రతిష్టాత్మక ‘విజనరీ లీడర్షిప్ ఇన్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్’ అవార్డు.
గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న రెనోవా హాస్పిటల్స్ ఫౌండర్ & సీఈఓ.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం:శ్రీధర్ పెద్దిరెడ్డి.
![]() |
| గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీధర్ పెద్దిరెడ్డి |
హైదరాబాద్, మే 23 (నమస్తే న్యూస్)
వైద్య రంగంలో నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న రెనోవా హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డికి ప్రతిష్టాత్మక ‘విజనరీ లీడర్షిప్ ఇన్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్’ అవార్డు లభించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహించిన జీ తెలుగు న్యూస్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.శ్రీధర్ పెద్దిరెడ్డి నాయకత్వంలో రెనోవా హాస్పిటల్స్ వైద్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందిస్తోంది. ప్రస్తుతం రెనోవా నెట్‌వర్క్ 12కు పైగా ఆధునిక యూనిట్లు, సుమారు 2 వేల పడకల సామర్థ్యంతో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ప్రిసిషన్ అంకాలజీ, ఆధునిక డయాగ్నోస్టిక్స్ సాంకేతికతలను ప్రవేశపెట్టి రోగి కేంద్రిత వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తోంది.అలాగే కార్డియాక్ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యత కార్యక్రమాల్లోనూ రెనోవా గ్రూప్ చురుకుగా వ్యవహరిస్తోంది. శ్రీధర్ పెద్దిరెడ్డి స్థాపించిన ‘శ్రీ ధరణి ఫౌండేషన్’ ద్వారా గ్రామీణ విద్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, సాంకేతికతతో పాటు మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.


