మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా ఒక్క అవకాశం ఇవ్వండి-చిర్ర సతీష్
(నమస్తే న్యూస్ ,నర్సింహులపేట ,మే 23)
ప్రస్తుతం నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న జినుకల రమేష్ పదవీ కాలం అయిపోయింది.. కొత్తగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం చేస్తున్నారూ...కావున నిను మీ చిర్ర సతీష్ గౌడ్ మీ అందరికీ 2009 నుండి వామపక్ష విద్యార్థి ఉద్యమంలో మండలంలోని మరియు డోర్నకల్ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూతన జిల్లా అయిన మానుకోట కూడా జిల్లాలో. విద్యార్థుల సమస్యల పక్షాన అనేక రకాల పోరాటాలు చేసి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాను. తదుపరి విద్యార్థి జీవితమైపోయిన తర్వాత 2016 చివరి భాగంలో అప్పుడు ఉన్న పరిస్థితుల నిమిత్తం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి పార్టీ నిర్మాణం పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా కష్టపడి పని చేశాను అధికారం ఉన్నా లేకపోయినా అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒకానొక సమయంలో మండల కేంద్రంలో వేల మీద లెక్కపెట్టి నాయకులు మాత్రమే మేము పోరాటం చేశాను. కొద్ది రోజులకే యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి ఇచ్చి నన్ను పార్టీ గౌరవించి పదవికి వన్నె తెచ్చే విధంగా యువజన నాయకులు కలుపుకొని పార్టీ నాయకులతో పాటు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశాను...అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలో భాగస్వామ్యం అవుతూ పార్టీలో ఏ పదవి ఇచ్చినా పార్టీ కోసం ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేశాను.. గత కొద్ది రోజులుగా మండల కాంగ్రెస్లో చురుగ్గా పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. నాకంటే పెద్దవారు నా కంటే చిన్నవారు అందరూ నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలంటే ఆర్థిక తోడ్పాటు లేకపోవడం నాకు మైనస్ పాయింట్ లో ఉంది. నాకు మండల అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని దయచేసి నాకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.గతంలో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా నాలుగు సంవత్సరాలు పనిచేసే పార్టీ అవసరాల రీత్యా అధికారంలోకి రావాలని పార్టీ కోసం ఉమ్మడి నర్సింహులపేట మండలం తో పాటు మరిపెడ మండలం కురవి మండలంలోని కొన్ని ప్రాంతాలలో పూర్తి సమయం కేటాయించి పనిచేయడం జరిగింది. కాబట్టి నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మండల నాయకులు కాక డోర్నకల్ నియోజకవర్గంలో నా స్నేహితులు ఇతరులు అందరూ సహకరించవలసిందిగా మనవి...

