తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధుల సదస్సును జయప్రదం చేయండి.
మహబూబాబాద్ జిల్లా నాయకులు తరలి రావాలి.
మహబూబాబాద్, మే 31 (నమస్తే న్యూస్):
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఫోరం నాయకులు పిలుపునిచ్చారు.ఈ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా నుంచి ఫోరం నాయకులు, ఉద్యమకారులు హైదరాబాద్‌కు బయలుదేరారు.సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, సంస్థ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వానికి అందించాల్సిన సలహాలు, సూచనలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.సదస్సుకు హాజరుకావడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సమ్మెట సమ్మయ్య గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు, సీనియర్ ఉద్యమకారుడు ఎం.డి. ఖాజామియా, జిల్లా ముఖ్య సలహాదారు ఆకుతోట సాయి కృష్ణ, తొర్రూరు మండల కార్యదర్శి ఏర్పుల వెంకన్న దస్తగిరి, ఉపాధ్యక్షుడు బానోతు రమేష్, నీలం అంబరీష్ తదితరులు జిల్లా నుంచి బయలుదేరారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉద్యమకారుల ఐక్యత వంటి అంశాలపై సదస్సులో సమగ్ర చర్చ జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతినిధుల సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు.

