పంట అవశేషాలు కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
۰ఎస్పీ కి వినతి పత్రం అందజేసిన ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి.
డోర్నకల్ /మరిపెడ,మే 30(నమస్తే న్యూస్)
ఆత్మ కమిటీ చైర్మన్ నాళ్ళు సుధాకర్ రెడ్డి పంట అవశేషాలను కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు.మహబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ శబరీష్ ని మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కల్సి పూల మొక్క అందించి,వ్యవసాయ శాఖ అవగాహన కల్పించినప్పటికీ కొంత మంది రైతులు తమ పంట అవశేషాలను కాల్చడం వలన భూమి భూసారం దెబ్బతిని దిగుమతి రాకపోగా,మంటలతో పక్కనే ఉన్న జామాయిల్,ఆయిల్ ఫామ్ మొక్కలు మోటార్లు,పైపులు కాలిపోవడం,భారీ ఎత్తున ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నాయని దీనిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకునే విధంగా దిశా నిర్దేశం చేయాలని వారిని కోరగా,స్పందించిన ఎస్పీ ఇప్పటికే తమ చర్యలు ప్రారంభమయ్యాయని,ఉదృతంగా చర్యలు తీసుకునే విధంగా తమ శాఖను మరింత అప్రమత్తం చేస్తున్నామని అన్నారు.

