●నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.
●యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి.
●యువతకు సీఐ ఎల్ పవన్ కుమార్ ప్రత్యేక సూచనలు.
డోర్నకల్ /మరిపెడ,మే 30 (నమస్తే న్యూస్ )
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్,ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల వరకు మరిపెడ మండలం కోటియా తండా పంచాయతీ పరిధిలోని చౌల్ల తండా,జాల్ తండా,అర్లగడ్డ తండాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అక్రమ సారా తయారీపై చేపట్టిన తనిఖీల్లో 50 లీటర్ల నాటు సారా,4 క్వింటాళ్ల బెల్లం,50 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.ఈ సందర్భంగా మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ యువతను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.యువత చెడు స్నేహాలకు,గంజాయి,నాటుసారా వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని హెచ్చరించారు.యువతే దేశ భవిష్యత్తు నిర్మాతలు.ఉన్నత చదువులు చదివి,మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబానికి,గ్రామానికి,దేశానికి పేరు తేవాలి.మీ ముందు తరాలకు మీరే ఆదర్శంగా నిలవాలని,ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దే భాధ్యత నేటి యువతపై ఉన్నదని,గ్రామాల భవిష్యత్ నిర్మాతలుగా యువత ముందుండాలని సీఐ,ఎస్సై గండ్రాతి సతీష్,చిన్నగూడూరు ఎస్సై కుశ్ కుమార్ సంయుక్తంగా పిలుపునిచ్చారు.చట్ట వ్యతిరేక పనుల జోలికి వెళ్లొద్దని,చెడు వ్యాసనాలకు భానిసలై యువత భవిష్యత్తును అందకారం చేసుకోవద్దన్నారు.అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఈ దాడుల్లో మరిపెడ సీఐ,ఎస్సైలతో పాటు 25 మంది సిబ్బంది పాల్గొన్నారు.అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.


