గంజాయి గుట్టు రట్టు చేసిన దంతాలపల్లి పోలీసులు.
- 500 గ్రాముల గంజాయి స్వాధీనం.
- ఓ యువకుడు రిమాండ్ కు తరలింపు.
దంతాలపల్లి, మే 29 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలోని బీరిశెట్టి గూడెం గ్రామ బస్టాండ్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం స్థానిక ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటం గమనించారు. అతడిని ఆపి తనిఖీ చేయగా, అతని వద్ద సుమారు 500 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.పట్టుబడిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన మిడతపల్లి నవీన్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

