Type Here to Get Search Results !

అమ్మ చేతుల మీదుగా నూతన గృహ ప్రవేశం.

అమ్మ చేతుల మీదుగా నూతన గృహ ప్రవేశం.


తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిన షేక్ నయీమ్ పాషా–షేక్ హసీనా దంపతులు.


నర్సింహులపేట, జూన్ 1 (నమస్తే న్యూస్):

సమాజంలో ఎంతోమంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మరచిపోతుంటారు. అయితే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన షేక్ నయీమ్ పాషా, ఆయన కోడలు (భార్య) షేక్ హసీనా తమ కుటుంబానికి అండగా నిలిచిన తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని వినూత్నంగా చాటుకున్నారు.ప్రస్తుతం నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్న నయీమ్ పాషా, తాను నిర్మించుకున్న నూతన గృహాన్ని తన తల్లి బీబొమ్మ చేతుల మీదుగా ప్రారంభింపజేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో షేక్ హసీనా కూడా పాల్గొని అత్తగారికి గౌరవం ఇవ్వడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా నయీమ్ పాషా మాట్లాడుతూ, చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తమ కుటుంబాన్ని తల్లి ఎంతో కష్టపడి ముందుకు నడిపించిందని, ఒంటరిగా ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి జీవితంలో స్థిరపడేలా చేసిందని తెలిపారు. తండ్రి లేని లోటును తల్లి ప్రేమ, త్యాగం, అంకితభావంతో భర్తీ చేసిందన్నారు.అమ్మ ఆశీర్వాదం ఉంటేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. అందుకే మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని అమ్మ చేతుల మీదుగా నిర్వహించామని నయీమ్ పాషా పేర్కొన్నారు.తల్లి పట్ల అపారమైన ప్రేమాభిమానాలు చాటుకున్న నయీమ్ పాషా హసీనా దంపతుల చర్యను గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, గౌరవం ఎలా ఉండాలో యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.