డెంగీ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అవసరం.
:జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్.
మహబూబాబాద్, మే 16 (నమస్తే న్యూస్): డెంగీ నియంత్రణకు ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ అన్నారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వాటిని తొలగించాలని సూచించారు. దోమల నివారణకు పొడవైన దుస్తులు ధరించడం, దోమతెరలు వినియోగించడం అవసరమన్నారు. డెంగీకి ప్రత్యేక ఔషధం, టీకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేనందున ముందస్తు జాగ్రత్తలే రక్షణ అని తెలిపారు.జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది “యునైట్.. యాక్ట్.. ఎలిమినేట్” నినాదంతో జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డిపిఎంఓ వాల్య, ఆరోగ్య విద్యా బోధకులు పురుషోత్తo, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎంపిహెచ్‌ఈఓ తోట శ్రీనివాస్, హెల్త్ సుపెర్వైజర్ ఫహీముద్దీన్, కౌన్సిలర్ రమేశ్ మహబూబాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఏఎన్‌ఎం లు , హెల్త్ అసిస్టెంట్ లు ఆశ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

