నమస్తే న్యూస్ నర్సింహులపేట
బాసుతండా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గా గుగులోతు వీరన్న
నర్సింహులపేట మండలం బాసుతండ
కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గా దాసుతండాకు చెందిన గుగులోతు వీరన్నను ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు.
గ్రామ సర్పంచి గుగులోతు క్రాంతి శ్రీనివాస్, ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెసు కార్యకర్తల సమక్షంలో మండల అధ్యక్షుడు జినుకల రమేష్ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీరన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన గ్రామ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రునాయక్ కృషి తో గ్రామంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచి, కార్యకర్తల సూచనల ప్రకారం పార్టీ అమలు చేసే కార్యక్రమాలు అమలు చేసే దిశగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.


