Type Here to Get Search Results !

ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తాం:మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

•రైతులు పండించిన ప్రతి గింజ...ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తాం.


•మీ కష్టాలను చూసి వచ్చాను... రాజకీయం చేయడానికి కాదు.


-మాజీ మంత్రి  సత్యవతి రాథోడ్

మాజీ మంత్రి కి తమ గోడు వెళ్లబోసుకుంటున్న రైతు.

రిపోర్టర్: చెలిమిల్ల గణేష్ (9440057073)

సెంటర్:డోర్నకల్ ఆర్.సి.

నర్సింహులపేట, మే 01(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  మాజీమంత్రి రాథోడ్ సత్యవతి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మీ కష్టాన్ని చూసి ఇక్కడికి వచ్చాను… రాజకీయం చేయడానికి కాదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడం నా బాధ్యత. మీరు పండించిన పంటకు సరైన ధర లభించాలి, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు,”అని తెలిపారు. అనంతరం మక్క రైతులకు గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో 50వేల  గన్నీ సంచులు అవసరం ఉండగా అందులో 15వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా మక్కలు, ధాన్యం కొనుగోలు చేయించి రైతులకు న్యాయం చేయించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలో సౌకర్యాలు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే మక్కలను, ధాన్యం ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు  బండ భిక్షంరెడ్డి, పటేల్ రామన్న, సర్పంచి శ్రీనివాస్ రెడ్డి, బారాస నాయకులు,పాల్గొన్నారు. 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.