హెల్మెట్‌తోనే సురక్షిత ప్రయాణం: డోర్నకల్ సీఐ చంద్రమౌళి
(నమస్తే న్యూస్, డోర్నకల్, ఏప్రిల్ 01)
రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని డోర్నకల్ సీఐ చంద్రమౌళి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం డోర్నకల్ పట్టణంలోని 13వ వార్డులో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ యల్లావుల సువర్ణ హరికృష్ణ, ఎస్సై గడ్డం ఉమా తదితరులతో కలిసి సీఐ చంద్రమౌళి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో హెల్మెట్ తలకు రక్షణ కవచంలా పనిచేసి ప్రాణాపాయం నుంచి కాపాడుతుందని తెలిపారు.13వ వార్డులో దాదాపు 100కు పైగా బైకులు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి అనుమతి ఉండదని హెచ్చరించారు.అవగాహన కార్యక్రమంలో భాగంగా కొంతమంది యువకులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యల్లావుల హరికృష్ణ, నాయకులు మాదా శ్రీనివాస్, మల్లం అనిల్, కౌన్సిలర్లు గారా రమేష్, రామకోటి, వీరన్న, వార్డు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

