Type Here to Get Search Results !

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రనాయక్

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు:

ఎమ్మెల్యే డా.రామచంద్రునాయక్.




(నమస్తే న్యూస్, కురవి, ఏప్రిల్ 02)

పేదల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మేడారపు శ్రీదేవి నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే  నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ సందర్భంగా మేడారపు శ్రీదేవి కుటుంబానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, వారి కొత్త ఇల్లు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కురవి మండల ప్రధాన కార్యదర్శి అవిర మోహన్ రావు గారు, టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ గారు, కురవి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు దైద భద్రయ్య గారు, అవిర సంధ్య దామోదర్ గారు, బోడ భారతి శ్రీను గారు,ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్ గారు, జుజూర్ తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెడద కృష్ణమూర్తి, రాములు వెంకన్న, తోడుసు ఉమేష్, పిట్టల రమేష్, సిపిఐ నాయకులు దూది కట్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.